Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

దేవీ
బుధవారం, 7 మే 2025 (15:35 IST)
Director: Basir Aluri
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘6జర్నీ. బసీర్ ఆలూరి దర్శకత్వంలో పాల్యం రవి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 9న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బసీర్ పలు విషయాలు తెలియజేశారు.
 
* సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఇది వరకు తెలుగులో సమరం, కన్నడలో మరో చిత్రాన్ని చేశాను. ఇప్పుడు నా మూడో సినిమా 6 జర్నీ అంటూ ఆడియెన్స్ ముందుకు వస్తున్నాను. ఇది ఆరుగురి జీవిత ప్రయాణం. గోవా ట్రిప్‌ను ఎంజాయ్ చేసి సూసైడ్ చేసుకోవాలని అనుకునే ఓ బ్యాచ్ కథే ‘6జర్నీ’. అలాంటి వారి ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథ.
 
* సమీర్, పల్లవి జంట అద్భుతంగా నటించింది. కొత్త అబ్బాయి విలన్‌గా అభిరాం చక్కగా నటించారు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఫైట్ మాస్టర్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. నిర్మాతది మా ఊరే. ఆయనకు సినిమా అంటే చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు నచ్చడంతో ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది.
 
* వర్షాకాలంలో ఈ మూవీ షూటింగ్ చేశాం. షూటింగ్ సమయంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రకృతి మాకు ఎంతో సహకరించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా షూటింగ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాం.
 
* మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎన్ సింహా మంచి పాటల్ని ఇచ్చారు. మంచి సంగీతం, మంచి పాటలు ఉన్నాయి. ఆల్రెడీ మా పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. మంచి కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.
 
* క్లైమాక్స్ చాలా గొప్పగా ఉంటుంది. శ్రీరాముడు పుట్టిన నేల మీద ఉగ్రవాదులు దాడి చేయడం ఏంటి? ఇక్కడ యువత ఎలా పోరాడాలి అంటూ దేశ భక్తిని రేకెత్తించేలా క్లైమాక్స్‌ను అద్భుతంగా తెరకెక్కించాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా క్లైమాక్స్ ఉంటుంది. సినిమా పూర్తిగా టెర్రరిజం మీదే నడుస్తుంది. అనుకున్న బడ్జెట్ కంటే కాస్త ఎక్కువే అయింది. బోర్డర్‌లో సినిమా షూటింగ్, వర్షాకాలం అవ్వడంతో కాస్త బడ్జెట్ పెరిగింది.
 
* మళ్లీ అక్టోబర్‌లో ఓ సినిమాను చేయబోతోన్నాను. ముంబై బ్యాక్ డ్రాప్‌లో ఆ చిత్రం ఉంటుంది. ఇంకా  చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

Mother: బాయ్‌ఫ్రెండ్ సాయంతో కన్నతల్లినే హత్య చేసిన కుమార్తె-చాకలి ఐలమ్మ ముని మనవరాలు..?

హైదరాబాద్ నగరంలో 42 డెంగ్యూ కేసులు- 2 రోజుల్లోనే 10 కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments