Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

Advertiesment
Rajendra Prasad, Archana and others

దేవీ

, మంగళవారం, 6 మే 2025 (21:00 IST)
Rajendra Prasad, Archana and others
రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా పవన్ ప్రభ దర్శకునిగా పరిచయ మవుతున్నారు. ‘మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్‘ పతాకం పై రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేయనున్నారు. 
 
ఈ సందర్బంగా దర్శక నిర్మాతలు పవన్ ప్రభ , రూపేష్ మాట్లాడుతూ – “ ఈ సినిమాకి ఎందరో హేమాహేమీలు పని చేశారు. అభినయంలో ఆరితేరిన రాజేంద్రప్రసాద్ , అర్చన ఈ సినిమాకు మెయిన్ అస్సెట్. ఇక ఇళయరాజా స్వరాల వల్ల మా చిత్రానికి ప్రేక్షకుల్లో గొప్ప అటెన్షన్ వచ్చింది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మళ్లీ విoటేజ్ ఇళయరాజాను వింటున్నామని అందరూ ప్రశంసిస్తున్నారు. 
 
‘ఏదో ఏ జన్మలోదో ..’ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సాహిత్యం అందించడం మా అదృష్టం. రెహమాన్ రచించిన ‘ఇరు కనులు కనులు కలిసి మురిసె‘ పాటను  ఎస్పి చరణ్ , విభావరి ఆలపించారు. ఎక్కడ విన్నా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఈ పాటల కారణంగా ప్రేక్షకుల్లోనే కాకుండా , బిజినెస్ సర్కిల్స్ లో కూడా మా సినిమాపై స్పెషల్ అటెన్షన్ వచ్చింది. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అవుట్ పుట్ కూడా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఈ సమ్మర్ కి మంచి ఫీల్ గుడ్ మూవీ తో వీడ్కోలు చెప్పవచ్చు. మిగిలిన 3 పాటలను , ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేస్తాం “ అని తెలిపారు.
 
రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ ,  'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, 'చలాకి' చంటి, 'బలగం' సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ ఇందులో ప్రధాన తారాగణం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి