Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Advertiesment
Allu Arjun 22 movie

దేవీ

, మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (10:57 IST)
Allu Arjun 22 movie
ఈరోజు అల్లు అర్జున్ తన 43వ ఏట అడుగుపెట్టాడు. 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నేడు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమాను ప్రారంభిస్తున్నారు. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.
 
webdunia
Allu Arjun latest poster
ఇక అల్లు అర్జున్ గురించి ఒకసారి పరిశీలిస్తే, గంగోత్రి సినిమాకుముందు డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. సింగిల్ లెగ్ తోనూ, చేతితోనూ డాన్స్ చేసి చిరంజీవిని, రాజేంద్రప్రసాద్ ను మెప్పించారు. మెగా ఫ్యామిలీ వెన్నెముకగా వున్నా పట్టుదలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీరంగంలో స్టార్ గా నిలబడ్డాడు. ఆయన్ను పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా దర్శకుడు సుకుమార్ బిరుదు ప్రకటించారు. అది ఫ్యాన్స్ కు బాగా నచ్చింది.

webdunia
Allu Arjun latest poster
అలా  పుష్ప2 తో ఒక్కసారిగా కెరీర్ ఆరోహణలోకి వెళ్ళింది. ఈ ఎదుగుదలకు మాస్ డైలాగ్స్ లాగా బ్రాండ్ డీల్స్ వస్తున్నాయి, బన్నీ టాలీవుడ్ సూపర్ స్టార్ కంటే ఎక్కువ అయ్యాడు. ఒకరకంగా  పాన్ ఇండియా బ్రాండ్ పవర్ హౌస్ గా నిలిచాడని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
 
2022 లో, అర్జున్ బ్రాండ్ విలువ $31.4 మిలియన్లుగా అంచనా వేయబడింది, ఇది భారతదేశంలోని టాప్ సెలబ్రిటీలలో అతనిని 20వ స్థానంలో నిలిపింది. 2023 నాటికి, అది $28.5 మిలియన్లకు చేరింది, క్రోల్ ప్రకారం అతన్ని 22వ స్థానంలో నిలిపింది. కానీ అతను నిజంగా ఎక్కడ ఎదిగాడు అంటే బ్రాండ్ విశ్వసనీయతలో - హన్సా రీసెర్చ్ బ్రాండ్ ఎండార్సర్ నివేదికలో 16వ స్థానం నుండి 7వ స్థానానికి ఎగబాకాడు.
 
webdunia
Allu Arjnu brand companies
సినిమాలతోపాటు ఆయన చేేసే వాణిజ్యప్రకటనలు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు పాన్-ఇండియా ఉత్పత్తి ప్రదర్శనలా ఉన్నాయి. KFC, కోకా-కోలా, ఫ్రూటీ, జొమాటో, హీరో మోటో కార్ప్, రెడ్‌బస్, రాపిడి, ఓఎల్‌ఎక్స్, కోల్‌గేట్, హాట్‌స్టార్, లాట్ మొబైల్స్ మరియు జోయాలుక్కాస్ తో ముందున్నాడు. అలాగే తన తండ్రి అల్లు అరవింద్ స్థాపించిన 100 శాతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంపెనీ ఆహాకు కూడా ప్రత్యేక ఆక్షణగా నిలిచాడు. దానితో అతని పారితోషికం కూడా వ్యాపారప్రకటనలకు ఫీజు 7 కోట్ల మధ్య ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
 
అతన్ని ఇంతలా అర్హుడిని చేసేది ఏమిటి? ప్రాంతాలను కలుపుకునే అపూర్వ సామర్థ్యం. 85 శాతం గుర్తింపు స్కోరుతో దక్షిణ భారతదేశంలో అత్యంత గుర్తింపు పొందిన నటుడిగా అతన్ని ర్యాంక్ చేసింది. అల్లు అర్జున్ ఫేస్ తోనే కాకుండా తనుధరించే  బ్రాండ్‌లు అతని పాన్ ఇండియా మాస్ అప్పీల్, స్థిరమైన ఆకర్షణ మరియు డ్యాన్స్-ఫ్లోర్ డైనమిజాన్ని తెలియజేస్తున్నాయి.
 
పలు సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్ లు చేసిన పుష్ప2లో మాత్రం ఓ స్థాయికి చేరింది. దానికితోడు కూల్ డ్యాన్స్ బ్రేక్‌లు చేస్తూ, అల్లు అర్జున్ కేవలం ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, అతను ప్రకటనల శక్తి కేంద్రం. అల్లు అర్జున్ ఆకట్టుకునే స్క్రీన్ ఉనికి, మాస్ అప్పీల్ తో భారతీయ బహుముఖ ప్రజ్ఞగా నిలిచేలా చేశాయి.

పుష్ప 2 రిలీజ్ విషయంలో పబ్లిసిటీలో తప్పడగుడు వేసినా, అవన్నీ మరిచిపోయేలా చేసేలా ఆయన ఉదారత నిలిచిందనే చెప్పాలి. ఇప్పటికైనా తన టీమ్ ను ఆయన సరిదిద్దుకుంటే బాగుంటుందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్