Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

Advertiesment
chiranjeevi

ఠాగూర్

, బుధవారం, 2 ఏప్రియల్ 2025 (19:41 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వం వహిస్తున్న చిత్రం "విశ్వంభర". ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మెగా అభిమానుల్లో మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ చిత్రంలో హీరో మెగాస్టార్ చిరంజీవి ఓ పాట పాడనున్నారని ఆ వార్త సారాంశం. ఆస్కార్ అవార్డు విన్నర్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత స్వరాలకు చిరంజీవి గాత్రం అందివ్వనున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే, ఇంకా ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ మెగా అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మెగాస్టార్ వాయిస్‌‍లో పాట వినాలని ఆశిస్తున్నారు. 
 
మరోవైపు, చిరంజీవి వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. జూన్ నెల నుంచ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే, దసరా ఫేం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు