Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

దేవీ
బుధవారం, 2 ఏప్రియల్ 2025 (16:49 IST)
Directors Nithin & Bharat
మేము టెలివిజన్లో డిఫరెంట్ షోస్ చేశాం. అప్పటినుంచి ప్రదీప్ పరిచయం. ఆయన ఫస్ట్ సినిమాకి చివర్లో ఒక ప్రమోషన్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది. అది మాకు ఎక్సయిటింగ్ గా అనిపించింది.  ప్రదీప్ తో చాలా క్రియేటివ్ థాట్స్ షేర్ చేసుకుంటాం. ఒకసారి ఈ ఐడియా చెప్పాము. బావుందన్నారు. తర్వాత బౌండ్ స్క్రిప్ట్ చేసి మొత్తం నరేషన్ ఇచ్చాం. ఆయనకు నచ్చింది. అలా ఈ మూవీ స్టార్ట్ అయింది అని డైరెక్టర్స్ నితిన్ & భరత్ అన్నారు.
 
హీరో ప్రదీప్ మాచిరాజు తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రానికి దర్శకత్వం వహించారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలోకి  రానుంది. ఈ సందర్భంగా దర్శకులు నితిన్, భరత్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
 
  ఇది పవన్ కళ్యాణ్ గారి టైటిల్. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుంది. అయితే కథకు యాప్ట్ గా ఉండడం వల్లనే ఈ టైటిల్ ని తీసుకోవడం జరిగింది.
 
-ఇది బ్యూటిఫుల్ జర్నీ. టెలివిజన్ డిఫరెంట్, మూవీ డిఫరెంట్. ఫిక్షన్ కి నాన్ ఫిక్షన్ కి చాలా తేడా ఉంటుంది. మేము ఫిక్షన్ కి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా కూడా పనిచేయలేదు. నాన్ ఫిక్షన్ లో జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది. కానీ సినిమా అలా కాదు.. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పరిస్థితిలో షూట్ చేయాల్సి వస్తుంది. దాన్ని రియాక్షన్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయినంత వరకు అర్థం కాదు. అయితే మాకు చాలా మంచి టీం ఉంది. మా డిఓపి బాల్ రెడ్డి గారు, మ్యూజిక్ రదన్ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. చాలా బాగా సపోర్ట్ చేశారు.  మంచి టీం వర్క్ తో సినిమాని అద్భుతంగా చేసాం.
 
హీరోయిన్ దీపిక పిల్లి తెలుగు అమ్మాయితో ఈ క్యారెక్టర్ ని చేయించాలనుకున్నాం. దానికి తగ్గట్టే ఆడిషన్ చేసాం. ఆ పాత్రకు తను పర్ఫెక్ట్ గా ఫిట్ అయింది. తన క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
 
-మైత్రి మూవీ మేకర్స్ సినిమాని చూశారు. వారికి సినిమా చాలా నచ్చింది. సినిమాలో చాలా పొటెన్షియల్ ఉందని చెప్పారు. ఇది సమ్మర్ కి రావాల్సింది సినిమా అని వారే రిలీజ్ డేట్ ఆలోచించి ఫిక్స్ చేశారు. వారే మా ఫస్ట్ ఆడియన్స్. వారి రియాక్షన్ చూసిన తర్వాత మాకు చాలా ఆనందంగా అనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

కంచా అడవిని కాపాడండి-బంజరు భూముల్ని వాడుకోండి- దియా, రేణు దేశాయ్, రష్మీ గౌతమ్ విజ్ఞప్తి

శునకంతో స్టంట్ చేసిన వ్యక్తి.. రైలు కింద పడిపోయింది.. తిట్టిపోస్తున్న నెటిజన్లు (video)

ప్రధాని మోడీ గారూ.. సమయం ఇవ్వండి.. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించాలి : సీఎం స్టాలిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments