బిగ్ బాస్ హౌస్‌లోకి ఎలిమినేట్ కంటెస్టెంట్స్.. పులిహోర చేయాలంటే..? (video)

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (17:10 IST)
Bigg Boss 4 Telugu
బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఇప్పటికే మోనాల్, కల్యాణి, లాస్య కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశారు. నేడు మిగతా కంటెస్టెంట్లు యూటూబ్ స్టార్ గంగవ్వ, సింగర్ నోయల్‌, సుజాత, జబర్దస్త్ అవినాష్‌, మెహబూబ్‌, దివి ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నారు. 
 
ఈ క్రమంలో నోయల్ తన ర్యాప్ సాంగ్‌తో ఫైనలిస్టుల్లో జోష్‌ను నింపాడు. ఇక మెహబూబ్‌ను చూడగానే సోహైల్ ఆనందంతో గంతులేశాడు. అటు పక్క మెహబూబ్ మాత్రం దివితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ జోడీని చూసి ఇంటి సభ్యులు కూడా రెట్టించిన హుషారుతో స్టెప్పులేశారు. గంగవ్వ, సుజాతలు మాత్రం కాసేపు కొట్టుకున్నట్లుగా నటించి ఆ వెంటనే మాస్ సాంగ్‌కు ఇరగదీశారు. 
 
ఇక అవినాష్ తనకు దొరికిన కాసింత సమయంలో కూడా కామెడీని పండించి ఆకట్టుకున్నాడు. అభిని చూస్తూ బయట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా లేదు, నెంబర్ అడుగుతున్నారు అని ఊరించి చివరిలో తన నెంబర్ అడుగుతున్నారని పంచ్ వేశాడు. అలాగే ఈ మధ్య మొహమాటం లేకుండా రెచ్చిపోయి మరీ పులిహోర కలుపుతున్న అఖిల్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు. 
 
పులిహోర చేయాలంటే ముందుగా కావాల్సింది అఖిల్ అంటూ జోకులు పేలుస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఈ ప్రోమోలో సూర్య కిరణ్‌, అమ్మ రాజశేఖర్‌, దేవి నాగవల్లి జాడ మాత్రం కనిపించలేదు. మరి వారు తర్వాతి ప్రోమోలో అయినా కనిపిస్తారో లేదో చూడాలి..మొత్తానిక బిగ్ బాస్ హౌస్ లో సందడితో పాటు రచ్చ రచ్చగా మారింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

Kerala: భార్య తలపై సిలిండర్‌తో దాడి చేసిన భర్త.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments