Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగుపాముతో సెల్ఫీ.. బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్‌కు కష్టాలు తప్పవా?

నాగుపాముతో సెల్ఫీ తీసుకున్న బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్ చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో నాగుపామును చేతిలో పట్టుకుని ఫోజిచ్చిన ఉల్ఫత్ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అటవీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంత

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (15:11 IST)
నాగుపాముతో సెల్ఫీ తీసుకున్న బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్ చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియాలో నాగుపామును చేతిలో పట్టుకుని ఫోజిచ్చిన ఉల్ఫత్ వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై అటవీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఆమెతో పాటు మరో నటి, ఇద్దరు ప్రొడక్షన్‌ మేనేజర్లను అరెస్టు చేశారు. ఈ వీడియోను శ్రుతి అక్టోబరు 16న సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. 
 
వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు వీరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముంబయి అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డైలీ సీరియల్‌ 'నాగార్జున' ప్రచారం కోసం శ్రుతి నాగుపాముతో ఉన్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. దీన్ని చూసిన పలువురు జంతు సంరక్షణ కార్యకర్తలు ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు శ్రుతిని, సీరియల్‌ యూనిట్‌ను విచారించింది. 
 
కానీ అది నిజమైన పాము కాదని యూనిట్ తెలిపింది. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం ఆ పాము నిజమైనదేనని పేర్కొంది. దీంతో శ్రుతికి నోటీసులు పంపి, పీవోఆర్‌ దాఖలు చేసి విచారణకు రమ్మనమని తెలిపారు. శ్రుతితోపాటు ఇద్దరు ప్రొడక్షన్‌ మేనేజర్లు విచారణకు బుధవారం వచ్చారు. అది నిజమైన నాగుపాము అని ఒప్పుకోవడంతో వారిని కోర్టుకు తీసుకెళ్లగా ఒక్కరోజు ఫారెస్ట్‌ కస్టడీలోకి తీసుకోమని తీర్పు ఇచ్చింది. 
 
సీరియల్‌ కోసం ప్రాణంతో ఉన్న పామును ఉపయోగించడాన్ని పలువురు జంతుప్రేమికులు, కార్యకర్తలు ఖండించారు. సోషల్‌మీడియాలో ఈ వీడియో పోస్ట్‌ చేశారు. అయితే దురుద్దేశంతో పాములకు హాని చేయాలని ఆమె ఈ వీడియో చిత్రీకరించలేదు కాబట్టి ఆమెకు ఈ నేరం కింద శిక్ష వేసే బదులు వన్య ప్రాణి సంరక్షణకు కృషిచేయమని కోరాలని పలువురు సూచించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments