Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్‌తో సహజీవనం చేశా... ఇపుడు రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు...

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (13:52 IST)
బలవన్మరణానికి పాల్పడిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఎట్టకేలకు స్పందించారు. తాను, సుశాంత్ కలిసి ఒక యేడాది పాటు సహజీవనం చేసినట్టు చెప్పారు. అయితే, ఇపుడు తనను అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. అంతేనా.. సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణను పాట్నా నుంచి ముంబైకు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో రియా చక్రవర్తి ఓ పిటిషన్ దాఖలు చేసింది. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును బీహార్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు దర్యాప్తును పాట్నా‌ నుంచి ముంబైకి బదిలీ చేయాలని పిటిషన్‌ వేసింది.
 
ఇందులో ఆమె ఆసక్తికర విషయాలు తెలిపింది. గత యేడాది కాలంగా తామిద్దరం సహజీవనం చేస్తున్నామని ఆమె చెప్పింది. గత నెల‌ 8న సుశాంత్‌ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయినట్లు ఆమె తెలిపింది. కుంగుబాటుతో బాధ పడుతున్న సుశాంత్‌ మందులు వాడేవాడని చెప్పింది.
 
గత నెల బాంద్రాలోని తన నివాసంలో అతడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నప్పటి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని చెప్పింది. సుశాంత్ మరణంతో కుంగిపోయిన తనను కొంత మంది అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె చెప్పింది. ముంబైలోని శాంతాక్రజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో దీనిపై ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని గుర్తుచేసింది. 
 
సుశాంత్‌ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే తన వాంగ్మూలం నమోదు చేశారని, అయినప్పటికీ పాట్నాలోనూ కేసు నమోదు కావడం తనను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. సుశాంత్‌ తండ్రికి బీహార్‌లో పలుకుబడి ఉందని, దీంతో కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పింది. ఈ కేసును మంబైకి బదిలీ చేయాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments