Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చిత్రం విడుదల రోజున ఉండే కిక్కే వేరప్పా : "ఖైదీ" దర్శకుడు వివి.వినాయక్

మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం యువ దర్శకులకు కూడా రావాలని 'ఖైదీ నంబర్ 150'వ చిత్ర దర్శకుడు వివి.వినాయక్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించి.. ఆ చిత్రం విడుదల ర

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (15:15 IST)
మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం యువ దర్శకులకు కూడా రావాలని 'ఖైదీ నంబర్ 150'వ చిత్ర దర్శకుడు వివి.వినాయక్ అభిప్రాయపడ్డారు. చిరంజీవి చిత్రానికి దర్శకత్వం వహించి.. ఆ చిత్రం విడుదల రోజున వచ్చే కిక్కే వేరని వినాయక్ అంటున్నారు.  
 
ఈ చిత్రం విజయంపై వినాయక్ మీడియాతో మాట్లాడుతూ... ఒక మనిషికి పట్టుదల ఉంటే వయసు అనేది కొలమానం కాదనే విషయం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ను చూసి ఫీలయ్యేవాడినని, ఆ తర్వాత చిరంజీవిని చూసే ఫీలవుతున్నాని అభిప్రాయపడ్డారు. "చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సినిమా చేసినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు కనపడలేదు. ఫారిన్ షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఆయన 14 గంటల పాటు పని చేసేవారని, ఈ విషయంలో చిరంజీవి ఎనర్జీకి హ్యాట్సఫ్ చెప్పాలన్నారు. 
 
అంతేకాదు యువ దర్శకులందరికి చిరంజీవి గారితో పనిచేసే అవకాశం రావాలని, ఆ అవకాశం వారికి లభిస్తే చిరంజీవి సినిమా విడుదల రోజున ఉండే కిక్కు ఏంటనేది వారికి తెలుస్తుందని వినాయక్ చెప్పుకొచ్చారు. కాగా, డేరింగ్‌, డాషింగ్‌, డైనమిక్‌ హీరోగా తెలుగు ప్రేక్షకుల్ని తన సినిమాలతో ఉర్రూతలూగించిన మెగాస్టార్.. ఇప్పుడు రీఎంట్రీలోనూ ఆదే తరహాలో ఆలరిస్తున్న విషయం తెల్సిందే. ఆయన నటించిన తాజా చిత్రం ఖైదీ నెంబర్ 150 సంక్రాంతికి విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం, కళ్ల కింద నల్లని చారలు, విపరీతమైన ఒత్తిడి, ఓ ఉద్యోగిని సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments