Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖైదీ నంబర్ 150" విలన్ దశ తిరగబోతుందట... ఎలాగో తెలుసా?

సుమారు దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతి కానుకకా విడుదలై సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకు కనకవర్షం కురిపిస్తోంది. కేవలం రెండు తెలుగ

Webdunia
శనివారం, 14 జనవరి 2017 (14:36 IST)
సుమారు దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం సంక్రాంతి కానుకకా విడుదలై సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకు కనకవర్షం కురిపిస్తోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా, ఓవర్సీస్‌లో సైతం ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో చిరంజీవికి విలన్‌గా నటించిన తరుణ్ అరోరాకు మాత్రం ఇకపై దశ తిరగబోతుందట. 'చూడాలనివుంది' సినిమాలో చిరుకి జంటగా అంజలా జవేరి నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆమె భర్త తరుణ్ అరోరా. ఆయనే ఇపుడు ఖైదీ చిత్రంలో చిరంజీవికి ప్రతి నాయకుడు. 
 
తమిళ 'కత్తి'లో నీల్ నితిన్ ముఖేష్ చేసిన ఆ పాత్రను.. తెలుగులో తరుణ్ అరోరా చేశాడు. తన వయసు కంటే చాలా పెద్దవయసు పాత్రను ఈ సినిమాలో పోషించడం జరిగింది. తెలుగులో మొదటి సినిమా అయినా ఎక్కడ కూడా ఆ ఛాయలు కనిపించకుండా బాగానే కవర్ చేశాడీ భాలీవుడ్ భామ భర్త. యాక్టింగ్, ఫైట్స్‌లలో అదరొగొట్టేశాడన్నది ఇండస్ట్రీ టాక్. 
 
దీంతో తరుణ్ అరోరా కోసం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నాయట. ఇందులోభాగంగా, ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీలో తరుణ్ అరోరాను విలన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం 2025: ఒంటరిగా శక్తిని పెట్టుబడి పెట్టే వ్యక్తి..

ఆరిజిన్ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి (Video)

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

చనిపోయిన పెంపుడు శునకం... ఆత్మహత్య చేసుకున్న యజమాని.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments