Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీజే సన్నీకి బంపర్ ఆఫర్.. నా కూతుర్ని పెళ్లి చేసుకో.. రూ.100 కోట్లు ఇస్తా?

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (14:00 IST)
బిగ్ బాస్ ఐదో సీజన్‌ విన్నర్ వీజే సన్నీకి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.  శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు ఫైనల్స్ చేరుకున్నారు. పోటీ పడ్డారు. వీరిలో వీజే సన్నీ ఇటీవల జరిగిన ఫినాలేలో విన్నర్ అయ్యాడు.
 
ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు హౌస్‌లో అద్భుతమైన ఆటతో సత్తా చాటాడు. కోపంతో పలుమార్లు గొడవలు పడినప్పటికీ.. ఆ తర్వాత తన ప్రేమను చూపించి కంటెస్టెంట్లతో పాటు ఆడియెన్స్ మనసులు కూడా గెలుచుకుని సీజన్ విజేతగా నిలిచి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేశాడు. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి సారిస్తూ.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సన్నీ సిద్ధమవుతున్న తరుణంలో సన్నీకి సూపర్ ఆఫర్ తలుపు తట్టింది. 
 
వీజే సన్నీకి ఏకంగా ఒక మహిళ.. పెళ్లితో పాటు వంద కోట్లు ఆఫర్ చేసింది. అసలు ఏం జరిగిందంటే.. సన్నీకి అమెరికాకు చెందిన ఓ మహిళ వీడియో కాల్ చేశారు. అప్పుడు తన కూతురుని పెళ్లి చేసుకోమని అతడిని కోరారు. అంతేకాదు, ఇందుకోసం కట్నంగా వంద కోట్ల రూపాయలు ఇస్తానని ఆ వీడియో కాల్‌లోనే ఆఫర్ చేసేశారు.
 
సదరు మహిళ మాటలను విన్న తర్వాత తనలో తాను నవ్వుకున్న వీజే సన్నీ 'రియల్ లైఫ్‌లోనూ నన్ను భరించాలంటే చాలా ఓపిక ఉండాలి. మీరు అంత పెద్ద మాట అన్నారు చాలు. చాలా థ్యాంక్స్. కానీ, నాకు కెరీరే ఇంపార్టెంట్. ఏమనుకోకండి' అంటూ రిప్లై ఇచ్చాడు. తద్వారా పెళ్లి సంబంధంతో పాటు వంద కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments