Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్రది ఆత్మహత్యే.. స్పష్టం చేసిన నిపుణుల కమిటీ (video)

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (13:14 IST)
ఎట్టకేలకు త‌మిళ నటి చిత్ర‌ ఆత్మహత్యేనని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను కేసు దర్యాప్తు చేస్తున్న నజరత్‌పేట పోలీసులకు అందజేయగా, వారు హైకోర్టుకు సమర్పించారు. టీవీ నటి చిత్ర, పూందమల్లికి చెందిన హేమనాధ్‌ అనే యువకుడిని ప్రేమించింది. వారి కుటుంబ సభ్యుల అంగీ కారంతో వీరి పెళ్ళి నిశ్చితార్థం జరిగింది.
 
అయినా పెద్దలకు చెప్పకుండా అక్టోబర్‌ 19న ఇద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్‌ మొదటివారంలో చిత్ర, హేమనాథ్‌ నజరత్‌పేటలోని ఓ స్టార్‌ హోటల్‌లో దిగారు.  చిత్ర  ఆ హోటల్‌ నుంచి వెళ్ళి టీవీ సీరియల్‌ షూటింగ్‌లో పాల్గొని వచ్చేది. ఆ నేపథ్యంలో డిసెంబర్‌ 9న చిత్రా, హేమనాధ్‌ల మధ్య తీవ్ర గొడవలు జరిగాయి. 
 
దీంతో కలత చెందిన చిత్ర తనగదిలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిత్రను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేరింపించాడనే నేరారోపణపై హేమనాధ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిత్ర పోస్టుమార్టం రిపోర్టును ఫోరెన్సిక్‌ ఇతర శాఖలకు చెందిన నిపుణుల పరిశీలనకు పంపింది. 
 
ఆ నిపుణులు పోస్టుమార్టంను పరిశీలించి చిత్ర ఉరిపోసుకునే ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. ఈ నివేదికను హేమనాధ్‌ బెయిలు పిటిషన్‌పై విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తి భారతిదాసన్‌కు పోలీసులు సమర్పించారు. న్యాయమూర్తి ఆ నివేదికను స్వీకరించి కేసు తదుపరి విచారణను మార్చి ఐదుకు వాయిదా వేశారు.
 
కాగా టీవీ నటి చిత్ర, పూందమల్లికి చెందిన హేమనాధ్‌ అనే యువకుడిని ప్రేమించింది. వారి కుటుంబ సభ్యుల అంగీ కారంతో వీరి పెళ్ళి నిశ్చితార్థం జరిగింది. అయినా పెద్దలకు చెప్పకుండా అక్టోబర్‌ 19న ఇద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. 
 
ఆ తర్వాత డిసెంబర్‌ మొదటివారంలో చిత్ర, హేమనాథ్‌ నజరత్‌పేటలోని ఓ స్టార్‌ హోటల్‌లో దిగారు. ఇద్దరి మధ్య ఏర్పడిన గొడవల కారణంగా.. కలత చెందిన చిత్ర తనగదిలో ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments