Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ బుడతడు ఎవరు.. హీ ఈజ్ సో క్యూట్.. హీ ఈజ్ సో స్వీట్.. హీ ఈజ్ సో హ్యాండ్ సామ్

Advertiesment
ShaliniAjith
, గురువారం, 28 జనవరి 2021 (08:03 IST)
Ajith Son
సోషల్ మీడియాలో కొందరు సెలెబ్రిటీల ఫోటోలు వైరల్ అవుతుండటం సాధారణమే. తాజాగా ఓ అబ్బాయి ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో క్యూట్‌ లుక్స్‌తో ఆ అబ్బాయి అదరగొడుతున్నాడు. ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో అందరు ఈ అబ్బాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంతకీ ముద్దు లొలికిస్తోన్న ఆ బుడతడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమారుడు. 
 
తాజాగా అజిత్ వాళ్ల ఇంట్లో జరిగిన ఓ పెళ్లిలో అజిత్ కుమారుడు ఆద్విక్ అజిత్ సందడి చేసాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో అజిత్ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. అజిత్.. ప్రస్తుతం తమిళనాట అగ్ర హీరోగా సత్తా చూపెడుతున్నాడు. ఈయన హీరోగానే కాకుండా.. బైక్ రేసర్‌గా అందరికీ సుపరిచితం. ముఖ్యంగా దక్షిణాది ఇండస్ట్రీలో బైక్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ తల అజిత్‌. ఈయనకు బైక్‌లంటే విపరీతమైన ఇష్టం... కాదు కాదు ప్రాణం.
 
ప్రొఫెషనల్ రేసింగ్‌లో కూడా పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు అజిత్. ప్రతీ సినిమాలో కూడా కచ్చితంగా ఒక్కటైనా ఛేజ్ సీన్ కూడా ప్లాన్ చేస్తుంటాడు ఈయన. అజిత్ బైక్ రైడింగ్ కెపాసిటీ తెలిసి దర్శకులు కూడా అలాంటి యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తుంటారు. 
 
ప్రస్తుతం ఈయన వలిమై సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈయన తెలుగులో 'ప్రేమ పుస్తకం' అనే సినిమాలో నటించాడు. ఆ తరవాత తమిళంలో నెంబర్ హీరోగా సత్తా చూపెడుతున్నాడు. తాజాగా అజిత్ కుమారుడి ఫోటోలు వైరల్ కావడంతో కుట్టి తల వచ్చేశాడని తల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ఆర్ఆర్ఆర్" దెబ్బకు బాలీవుడ్ గగ్గోలు... రిలీజ్ తేదీపై ఆగ్రహం