Webdunia - Bharat's app for daily news and videos

Install App

''విశ్వాసం'' అజిత్ కటౌట్.. కూలిపోయింది.. (వీడియో)

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (14:27 IST)
తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం సినిమా గురువారం (జనవరి-10) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే అభిమానులు కటౌట్స్ పెట్టడం, పాలాభిషేకం చేయడం చేస్తుంటారు. ఇలా అజిత్ ఫ్యాన్స్ అజిత్ విశ్వాసం విడుదలను పురస్కరించుకుని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. కానీ ఆ కటౌట్‌ను కూలిపోవడంతో తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడు విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
దాదాపు ఏడాదిన్నర తర్వాత అజిత్ నటించే విశ్వాసం సినిమా కోసం విల్లుపురం ఫ్యాన్స్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. విల్లుపురం జిల్లా, తిరుక్కోవిళూరులోని శ్రీనివాస థియేటర్లో అజిత్ కోసం భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి కటౌట్‌పైకెక్కి మాలలను వేశారు. పాలాభిషేకం చేశారు. అయితే ఉన్నట్టుండి కటౌట్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయాలకు గురైయ్యారు. 
 
వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని వీరికి పుదుచ్చేరి ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు. పెద్ద హీరోల కోసం కటౌట్లు పెట్టడం హీరోలు వద్దంటున్నా.. ఫ్యాన్స్ మాత్రం వారి అభిమానానికి మాత్రం ఇలాంటి భారీ కటౌట్లు పెట్టడం చేస్తుంటారు. ఇలాంటి కటౌట్ల సంగతి ఓకే కానీ ఇందులో ఎంత ప్రమాదముందని గ్రహించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments