Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రిజ‌ల్ట్ గురించి క్రిష్ రియాక్ష‌న్..!

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (14:00 IST)
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. గ‌మ్యం, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. ఇలా  వైవిధ్య‌మైన చిత్రాల‌ను అద్భుతంగా తెర‌కెక్కించ గ‌ల క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రానికి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. తొలి రోజు భారీ స్ధాయిలో ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాని హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో బాలకృష్ణ, ఆయన కుటుంబసభ్యులు, దర్శకుడు క్రిష్ చూశారు. అనంతరం మీడియాతో క్రిష్ మాట్లాడుతూ... మా పని ఇంకా కొనసాగుతోంది. రామారావు గారి గురించి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది.
 
రామారావు గారిది ఒక గొప్ప కథ. ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా అందమైన స్క్రీన్ ప్లే కుదిరింది. ఈ సినిమా గురించి వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తుంటే నిజంగా చాలా గ‌ర్వంగా ఉంది. ఎన్టీఆర్ ప్రభ ఏమాత్రం తగ్గకుండా, ఆయన శోభను ప్రెజెంట్ చేసినందుకు కించిత్తు గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఏఎంబీ స్క్రీన్-1లో ఈ సినిమా చూశాను. కొన్ని స్క్రీన్స్‌లో ఎఫెక్ట్స్ బాగా ఉండవు కానీ... మేము ఏదైతే ఎంత గొప్పగా తీశామో అంతే గొప్పగా ఈ స్క్రీన్‌లో ఉంది. ఇంకోసారి ఆ స్క్రీన్ లోనే సినిమా చూడాలి అనుకుంటున్నాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments