Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ఇంటిముందు నిప్పంటించుకుని సూసైడ్ చేసుకున్న వీరాభిమాని.. ఎందుకు?

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (12:54 IST)
వీరాభిమాని ఒకరు హీరో ఇంటి ముందు శరీరంపై కిరోసిన్ పోసుసుని నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తమ అభిమాన హీరో పుట్టిన రోజునాడు ఆయన్ను స్వయంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లాడు. కానీ, హీరోను కలిసేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కన్నడ స్టార్ యష్ తన పుట్టిన రోజు ఈనెల 8వ తేదీ. కానీ, సీనియర్ హీరో అంబరీష్ మృతితో ఆయన తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతాద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో హీరో యష్‌ను చూసేదుకు బెంగుళూరు శాంతి నగర్‌కు చెందిన రవి అనే వీరాభిమాని హీరో ఇంటికెళ్లాడు. 
 
కానీ, అక్కడ హీరో ఇంటిలోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో మనస్థాపానికి గురైన రవి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న హీరో యష్.. మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments