Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతున్న టైమ్ ని ద్రుష్టిలో పెట్టుకొని చేసిన సినిమా విశ్వం : శ్రీను వైట్ల

డీవీ
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (10:03 IST)
Gopichand, Srinu Vaitla, TG Vishwa Prasad, Kavya Thapar
గోపీచంద్, శ్రీను వైట్ల, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ పై రూపొందిన  'విశ్వం' అక్టోబర్ 11న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్ లో భాగంగా టీజర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ నిర్వహించింది.
 
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటారో మారుతున్న టైమ్ ని ద్రుష్టిలో పెట్టుకొని ఒక ఫ్రెష్ థీమ్, చాలా లేయర్స్ తో ప్రాపర్ బ్లెండ్ తో చేసిన కమర్షియల్ సినిమా ఇది. వేణు దోనేపూడి తో సినిమా స్టార్ట్ అయ్యింది. తర్వాత విశ్వగారు స్ట్రాంగ్ సపోర్ట్ గా వచ్చారు. అవుట్ పుట్ చూసి అందరూ హ్యాపీగా వున్నారు. నాకు సపోర్ట్ గోపి నిలిచారు. కావ్య థాపర్ ఎనర్జిటిక్ గా చేసింది.

చాలా పెద్ద స్కేల్ వున్న ఫిలిం ఇది. నా గత సినిమాలకి మించి ఇందులో హిలేరియస్ కామెడీ వుంటుంది. దసరాకి ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేశాలా వుంటుంది. చేతన్ ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. గుహన్ అద్భుతమైన కెమరా వర్క్ ఇచ్చాడు. ఇటలీ రొమ్ మిలాన్ సర్జినియా గోవా హిమాచల్ ప్రదేశ్ .. ఇలా చాలా ప్లేసస్ లో షూట్ చేశాం. గుహన్ సపోర్ట్ తో ఈజీగా చేయగలిగాను. అందరికీ పేరుపేరునా థాంక్ యూ' అన్నారు. 
 
హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా అయ్యేది కాదు. శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. వన్ ఇయర్ బ్యాక్ ఆయన్ని ఓ పార్టీలో కలవడం, సినిమా చేద్దామని అనుకోవడం, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. శ్రీను వైట్ల గారు కంఫర్ట్ బుల్, హీరో డైరెక్టర్. హీరోని ఎలా చూపించాలనే కంప్లీట్ క్లారిటీ వున్న డైరెక్టర్. ఈ జర్నీ చాల ఎంజాయ్ చేశాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. సినిమా చాలా బావొచ్చింది. ఒక మంచి ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాను. శ్రీను గారు అందులో మాస్టర్. ఇంత పెద్ద స్కేల్ లో ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేంలో నవ్వు వస్తునే వుంటుంది. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కావ్య చాలా బాగా చేసింది. చేతన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గోపి మోహన్ నా లక్ష్యం, లౌక్యం తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పని చేశారు. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందనే నమ్మకం వుంది' అన్నారు 
 
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. యుఎస్ లో శ్రీవైట్ల గారి సినిమాల నుంచే స్టార్ట్ చేశాను. వెంకీ నుంచి ఇప్పటివరకూ ఆయన సినిమాలు ఫాలో అవుతున్నాం. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా వుంది. గోపి గారితో ఇది మా రెండో సినిమా. తప్పకుండా అందరినీ లరిస్తుంది' అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments