Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప-2' రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డు.. భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్

ఠాగూర్
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (19:33 IST)
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన తాచా చిత్రం "పుష్ప-2". డిసెంబరు నెలలో విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ పలుకుతుంది. టాప్ ఓటీటీ ప్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పటివరకూ ఏ భారతీయ మూవీకి వెచ్చించనంత పెట్టి మరీ 'పుష్ప-2' హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 275 కోట్లకు ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. 
 
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక హిందీలో అనిల్ తడాని ఈ సినిమాకు రూ.200 కోట్ల ఖర్చు చేసి హక్కులు కొనుగోలు చేశారు. అది కూడా అడ్వాన్స్ బేసిస్ మీద. అంతేకాకుండా మ్యూజిక్ కూడా భారీ రేటు పలికింది. 
 
టీ సిరీస్ సంస్థ ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ హక్కుల కోసం రూ.60 కోట్లు ఖర్చు పెట్టింది. ఇది కూడా ఒక రికార్డేనని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే నాన్ థియేట్రికల్, థియేట్రికల్ రూ.1000 కోట్లు రిలీజ్‌కి ముందే బిజినెస్ జరిగిందనే టాక్ నడుస్తోంది. ఇప్పటివరకూ భారత సినీ చరిత్రలోనే ఈ బిజినెస్ అత్యధికమని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments