Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ- ఫస్ట్ లుక్

డీవీ
శుక్రవారం, 29 మార్చి 2024 (15:15 IST)
Mechanic Rocky First Look
'గామి' సక్సెస్‌తో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, అతని మైల్ స్టోన్ #VS10 మూవీ మేకర్స్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది.
 
ఈ చిత్రానికి 'మెకానిక్ రాకీ' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ పోస్టర్ ని క్రియేటివ్ గా డిజైన్ చేసారు. పోస్టర్ లో రాకీగా విశ్వక్ ఇమేజ్ ని మనం చూడవచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ మాస్ ను పవర్ ఫుల్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. అతను చేతిలో పెద్ద రెంచ్‌తో సిగరెట్ తాగుతూ కొంటె చూపుతో కనిపించారు. లైట్ గడ్డంతో, స్టైలిష్ దుస్తులను ధరించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మెకానిక్‌ షెడ్‌ని మనం చూడవచ్చు. టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
 
కామెడీ,యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. మనోజ్ కటసాని డీవోపీగా, అన్వర్ అలీ ఎడిటర్ గా, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సత్యం రాజేష్ , విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.
 
తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments