Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విష్ణు విశాల్‌కు షాక్ : మూడు అరబ్ దేశాల్లో ఎఫ్ఐఆర్ నిషేధం

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (10:18 IST)
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ నటించిన తాజా చిత్రం "ఎఫ్ఐఆర్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనివున్నాయి. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన "ఎఫ్ఐఆర్‌"కు మూడు అరబ్ దేశాలు తేరుకోలేని షాకిచ్చాయి. 
 
కువైట్, మలేషియా, ఖతార్ దేశాలు ఈ చిత్రాన్ని విడుదల చేయకుండా నిషేధం విధించాయి. ఈ విషయాన్ని విష్ణు విశాల్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. సినిమాలోని కంటెంట్ కారణంగా ఆయా దేశాల్లో విడుదల చేసేందుకు ఆ దేశాల సెన్సార్ బోర్డును అనుమతి నిరాకరించినట్టు సమాచారం. 
 
కాగా, ఈ చిత్రంలో విష్ణు విశాల్, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌతం మీనన్ వాసుదేవ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇందులో విష్ణు విశాల్ మోస్ట్ వాంటెడ్ యువకుడిగా నటించగా, గౌతం మీనన్ ప్రధానమంత్రినికి జాతీయ భద్రతా సలహాదారుడి పాత్రలో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments