విశాల్ ‘రత్నం’ సెన్సార్ పూర్తి - యాక్షన్‌తో పాటు సందేశం ఉందన్న సభ్యులు

డీవీ
గురువారం, 25 ఏప్రియల్ 2024 (16:31 IST)
Vishal
యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు రత్నం రాబోతోంది. ఇది వరకే ఈ ఇద్దరి కాంబోలో భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సారి రత్నంతో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.

రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. రత్నం సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 26న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 
 
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఎటువైపో ఎటువైపో.. అనే పాట శ్రోతలను మెప్పించింది. దేవీ శ్రీ ప్రసాద్ విశాల్ కాంబోలో రత్నం మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి రత్నం మీద పడంది. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
 
సినిమా రేపే (ఏప్రిల్ 26) విడుదల కానుంది. ఈ మేరకు సెన్సార్ సభ్యులు సినిమాను వీక్షించి యూ/ఏ సర్టిఫికెట్‌ను అందించారు. ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కొనియాడారు. ఈ చిత్రం ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డాబా మీద తల్లి.. ఇద్దరు పిల్లలు.. గోడమీద నుంచి తొంగి చూసిన చిరుత.. ఆ తర్వాత? (video)

దృశ్యం సినిమా చూసి భార్య హత్యకు ప్లాన్ చేసిన భర్త... ఏమీ తెలియనట్టుగా పోలీసులకు ఫిర్యాదు...

Red Fort blast: ఢిల్లీలో కారు పేలుడు.. ఎలాంటి పుకార్లను పట్టించుకోవద్దు.. అలెర్ట్

అద్దెకొచ్చిన మహిళతో అక్రమ సంబంధం... పెళ్లికి ఒత్తిడి చేయడంతో చంపేసిన యజమాని...

దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ 2025: 30 రోజుల పాటు కదలడానికి, కనెక్ట్ అవ్వడానికి ప్రపంచవ్యాప్త ఆహ్వానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments