గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కకు పూనీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్

Webdunia
సోమవారం, 1 నవంబరు 2021 (18:53 IST)
Vishal-Arya-mrinalini ravi
మొక్కల యజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు సాగుతుంది. కాలాల్ని, సంస్కృతుల్ని, స్మృతుల్ని తనలో మిలితం చేసుకొని సరికొత్తగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అందులో భాగంగానే  ఇవ్వాల “ఎనిమీ” సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, నటి మిర్నాళిని రవి “గ్రీన్ ఇండియా చాలెంజ్” లో భాగంగా హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
 
అనంతరం విశాల్ మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రభుత్వ మానసపుత్రిక “హరితహారం” స్పూర్తితో ప్రారంభించిన “గ్రీన్ ఇండియా చాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో వారు ప్రారంభించిన ఈ “గ్రీన్ ఇండియా చాలెంజ్” గ్లోబల్ వార్మిగ్ ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది. అందుకే  ప్రతి ఒక్కరు బాధ్యతగా “గ్రీన్ ఇండియా చాలెంజ్”లో పాల్గొని మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను. అంతేకాదు తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ గుర్తుగా ఈరోజు మొక్కని నాటుతున్నానని.. ఈ మొక్క తన స్నేహితునికి గుర్తుగా ఉంటుందని తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో నటుడు ఆర్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగస్వామ్యం అయి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విదిగా మొక్కలు నాటాలని కోరారు.ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి నటుడు ఆర్య ధన్యవాదాలు తెలిపారు.
 
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా నటి మిర్నాళిని రవి కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషాన్నిచ్చిందని అన్నారు.   అనంతరం “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ఎనిమీ చిత్ర బృందానికి అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments