Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

దేవీ
సోమవారం, 25 ఆగస్టు 2025 (10:35 IST)
Vishal _ makutam
హీరో విశాల్ 35వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇంత వరకు విశాల్ 35 అంటూ ఈ ప్రాజెక్ట్‌కు వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్ టైటిల్‌ను రివీల్ చేస్తూ టీజర్‌ను విడుదల చేశారు.
 
విశాల్, అంజలి, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీకి ‘మకుటం’ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ మేరకు వదిలిన టీజర్‌ను గమనిస్తే.. ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫియా కథ అని అర్థం అవుతోంది. సముద్రం లోపలి జీవరాశుల్ని చూపిస్తూ.. చివరగా విశాల్‌ను బ్యాక్ సైడ్ నుంచి చూపించారు. ‘మకుటం’ చిత్రంలో విశాల్‌ను సరికొత్తగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది.
 
‘మకుటం’ టైటిల్ టీజర్‌లో జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ఆర్ఆర్ అద్భుతంగా ఉంది.  ఈ మూవీకి ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఇతర వివరాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
 
తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments