Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

Advertiesment
vishal couple

సెల్వి

, గురువారం, 17 జులై 2025 (18:45 IST)
పందెం కోడి హీరో విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తొలుత వరలక్ష్మితో ప్రేమ, ఆపై మరో యువతితో నిశ్చితార్థం.. ప్రస్తుతం హీరోయిన్ ధన్షికతో వివాహం జరగబోతుందనే వార్తలు వచ్చాయి. ధన్షిక కూడా విశాల్‌తో పెళ్లి వార్తలను కన్ఫామ్ చేసింది. వీరిద్దరి వివాహం ఆగస్టు 29వ తేదీన జరుగుతుందని ప్రకటించారు. 
 
అయితే ఈసారి తన పుట్టిన రోజైన ఆగస్టు 29వ తేదీన పెళ్లి గురించి సరైన ప్రకటన చేస్తానని చెప్పాడు. ఇంతలో నడిగర్ సంఘం బిల్డింగ్ పనులు కూడా పూర్తవుతాయని చెప్పాడు. ఆ నడిగర్ సంఘం బిల్డింగ్‌లోనే తన పెళ్లి జరుగుతుందని.. ఇప్పటికే హాలును కూడా బుక్ చేశానని విశాల్ తెలిపాడు. దీంతో ఆగస్టు 29న విశాల్ పెళ్లి వుండదనే విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. 
 
నడిగర్ సంఘం బిల్డింగ్ కోసం 9ఏళ్ల పాటు వివాహం చేసుకోకుండా విశాల్ వేచి వున్నాడు. ఈ పనులు పూర్తయ్యాకే తాను పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఇచ్చిన మాట ప్రకారమే ఆగస్టు 29న తన వివాహాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్