Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయ‌క్ మూవీలో విల‌న్ ఎవ‌రో తెలుసా..?

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (21:54 IST)
ఆది, దిల్, బ‌న్నీ, ఠాగూర్, సాంబ‌, ల‌క్ష్మీ, కృష్ణ‌, అదుర్స్, అల్లుడు శీను,  ఖైదీ 150... ఇలా మాస్ మూవీస్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయక్. ఇన్నాళ్లు డైరెక్ట‌ర్ గా ఆక‌ట్టుకున్న వినాయ‌క్ హీరోగా సీన‌య్య అనే సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. శంక‌ర్ ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో వ‌ర్క్ చేసిన న‌ర‌సింహారావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.
 
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే... ఈ సినిమాలో వినాయక్‌కు విల‌న్‌కి టాలీవుడ్‌ యంగ్ హీరో నటించనున్నాడు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత విలన్‌గా, సపొర్టింగ్‌ రోల్స్‌లోనూ ఆకట్టుకుంటున్న నవీన్‌ చంద్ర ఈ సినిమాలో విలన్‌గా నటించనున్నాడని తెలిసింది.
వినాయ‌క్ ఈ సినిమా కోసం చాలా జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.
 
వినాయక్‌ మెకానిక్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కమర్షియల్ సినిమా తరహా యాక్షన్‌, బిల్డప్‌ సీన్స్‌ పెద్దగా ఉండవట‌. ఎమోషనల్‌ డ్రామాగా రూపొందుతోన్న‌ ఈ సినిమా పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి.. డైరెక్ట‌ర్ గా స‌క్స‌స్ సాధించిన వినాయ‌క్,  యాక్ట‌ర్ గా ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో..?  బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సంద‌డి చేస్తాడో...? చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments