Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో సందడి చేస్తున్న 'వినయ విధేయ రామ' టీజర్

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (15:08 IST)
మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వినయ విధేయ రామ' చిత్ర టీజర్ నవంబరు 9వ తేదీ శుక్రవారం విడుదలైయింది. మొత్తం 49 సెకండ్ల నిడివి గల ఈ టీజర్‌ను ఫుల్‌మాస్ సీన్లతో నింపేశారు. ముఖ్యంగా చరణ్, 'రామ్ కొ.. ణి.. దె.. ల..' అంటూ చెప్పే డైలాగ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. మొత్తానికి ఈ టీజర్ చూస్తుంటే బోయపాటి శ్రీను గత చిత్రాల కంటే ఎక్కువగా ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. 
 
ఇక ఈ టీజర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
"రంగస్థలం" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్‌ విడుదల కావడం మెగా ఫ్యాన్స్‌కు ఓ పండగలా ఉంది. ముఖ్యంగా ఈ టీజర్‌లోని తమ అభిమాన హీరో చెప్పే డైలాగులు మెగా ఫ్యాన్స్‌ను ఆలరిస్తున్నాయి. 
 
"అన్నయ్య వీడిని చంపెయ్యాలా? భయపెట్టాలా?" అనే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. "భయపెట్టాలంటే 10 నిమిషాలు చంపేయాలంటే పావుగంట. ఏదైనా ఓకే.. సెలక్ట్ చేసుకో" అంటూ చెర్రీ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల’ అంటూ చెర్రీ మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే ఏకంగా 10 లక్షల 50 వేల 876 మంది వీక్షించగా, 113 వేల మంది లైక్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments