Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్స్, థ్రి ల్లర్‌తో కూడిన ఇన్‌టెన్స్‌ డ్రామాగా వినరో భాగ్యము విష్ణు కథ టీజర్

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (11:48 IST)
Vinaro Bhagyamu Vishnu Katha
కిరణ్ అబ్బవరం, కాశ్మీర, మురళీ శర్మ, ఆమని తదితరులు నటించిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ. ఈరోజే టీజర్ విడుదలైంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడు. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు  నిర్మిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి ఇదివరకే రిలీజైన  "వాసవసుహాస" పాటకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈరోజే విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది.
 
టీజర్ ఎలావుందంటే.. 
 
నా పేరు విష్ణు, మా జీవితాలన్నీ ఏడుకొండల చుట్టూ తిరగావుంటాయి. ఇంకొన్ని రోజుల్లో చూడబోయేదే మా కథ. అంటూ హీరో డైలాగ్ తో మొదలయింది. కథంటూన్నావ్‌ .ఏంటీ లవ్‌ స్టోరీనా.. అంటూ  విలన్‌.. అడగడం.. ఆయన చుట్టూ గుండుకొట్టించుకున్న కొంతమంది బ్యాచ్‌ వుండటం వెరైటీగా ఉంది. ఇక మురళీ శర్మ.. ఆంటీ.. అంటూ ఆమని ని సంబోధించడం. ఆ తర్వాత.. అల్లు అర్జున్‌ లా డాన్స్‌ వేయడం.. వినూత్నంగా ఫన్ గా వుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు, కాన్సెప్ట్‌తో మొదలై, సస్పెన్స్‌తో థ్రిల్లర్‌తో కూడిన ఇన్‌టెన్స్‌ డ్రామాగా. అంటూ హీరో డైలాగ్‌.... ఇలా సరదాగా, సస్పెన్స్‌గా ట్రైలర్‌ సాగుతుంది. ఇలా టీజర్ మొదటి నుండి చివరివరకు ఆసక్తికరంగా మలిచారు. 
 
మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments