Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమె నా కూతురులాంటిది.. రొమాన్స్ చేయలేను: కృతిశెట్టిపై విజయ్ సేతుపతి

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (17:28 IST)
హీరోయిన్ కృతిశెట్టిపై తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తెలుగులో ఉప్పెన సినిమా తర్వాత తమిళంలో ఒక సినిమాకి ఓకే చెప్పాను. అందులో హీరోయిన్‌గా కృతిశెట్టి బాగుంటుందని భావించిన చిత్ర యూనిట్ ఆమె ఫోటోను నాకు పంపారు. వెంటనే నేను మా యూనిట్‌కి ఫోన్ చేసి.. ఇదివరకే ఆమెకు నేను తండ్రిగా నటించాను. ఈ సినిమాలో ఆమెతో నేను రొమాన్స్ చేయలేను.. అందుకే హీరోయిన్‌గా కృతి వద్దని చెప్పాను' అని విజయ్ సేతుపతి తెలిపారు. 
 
'ఉప్పెన సినిమా క్లైమాక్స్ చిత్రీకరణలో కృతిశెట్టి కంగారు పడింది. దీంతో నాకు నీ అంత వయసున్న కొడుకు ఉన్నాడు. నువ్వు కూడా నా కూతురుతో సమానం.. భయపడకు.. ధైర్యంగా చెయ్ అని ప్రోత్సహించాను. కూతురిలా భావించిన కృతిశెట్టిని జోడీలా భావించడం నా వల్ల కాదు' అని విజయ్ సేతుపతి వెల్లడించారు.
 
ఇకపోతే.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు చిత్రసీమలో సైతం తనదైన ముద్ర వేసుకున్నారు. సైరా నరసింహ రెడ్డి, ఉప్పెన వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన సేతుపతి.. తాజాగా శృతిహాసన్‌తో కలిసి లాభం అనే చిత్రంలో నటించారు. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుండగా.. ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన నటి కృతిశెట్టిపై పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments