Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ బర్త్‌డే స్పెషల్.. బీస్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్

Webdunia
సోమవారం, 21 జూన్ 2021 (20:14 IST)
తమిళ స్టార్ హీరో విజయ్ తన పుట్టినరోజును మంగళవారం జరుపుకోనున్నారు. దీన్ని పురస్కరించుకుని అభిమానులను ఖుషీ చేసేందుకు వీలుగా ఒక రోజు ముందుగా అంటే జూన్ 21వ తేదీ సోమవారం తన 65వ చిత్రం టైటిల్‌తో పాటు..  ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. 
 
లేడీ సూపర్‌స్టార్ నయనతారతో ‘కొలమావు కోకిల’ (కో కో కోకిల), శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్’ మూవీస్ చేసి, చక్కటి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
 
కళానిధి మారన్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్ నటిస్తున్న 65వ సినిమా ఇది. హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ విజయ్‌తో జతకడుతోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.
 
దళపతి కొత్త సినిమాకి ‘బీస్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బనియన్‌ వేసుకుని, రఫ్ లుక్‌లో, చేతితో గన్‌తో విజయ్ లుక్ ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా ఉంది. సోషల్ మీడియాలో #BEASTFirstLook #Thalapathy65FirstLook హ్యాష్ ట్యాగ్స్‌తో విజయ్ ‘బీస్ట్’ ఫస్ట్ లుక్ ట్రెండ్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments