విజయ్ దేవరకొండ - సమంతలకు గాయాలు : క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

Webdunia
మంగళవారం, 24 మే 2022 (12:20 IST)
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంతలు షూటింగ్‌లో గాయపడినట్టు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం "ఖుషి". శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుంటే, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను ఇటీవలే కాశ్మీర్‌లో పూర్తి చేసుకుంది. దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరిగింది. 
 
ఇందులో విజయ్, సమంత, వెన్నెల కిషోర్, శరణ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్, సమంతలు గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. కాశ్మీరులోని పహల్గామ్ ప్రాంతంలో స్టంట్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నపుడు వీరిద్దరూ లిడ్డర్ నదిలో పడిపోయారని, దీంతో వారికి స్వల్పంగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి. 
 
వీటిని చిత్ర బృందం తోసిపుచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. టీం అంతా కాశ్మీరులో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని విజయవంతంగా హైదరాబాద్ నగరానికి చేరుకున్నట్టు తెలిపింది. ఎలాంటి పుకార్లు నమ్మొద్దని కోరింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుందని పేర్కొంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments