Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు అత్తగా రాములమ్మ

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (12:36 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మరో కొత్త చిత్రంపై దృష్టిపెట్టారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండగా, అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి విజయశాంతిని, మరో కీలకమైన పాత్ర కోసం రమ్యకృష్ణను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.
 
దీంతో విజయశాంతి ఏ పాత్రలో కనిపించనుంది? రమ్యకృష్ణ పాత్ర ఏమిటి? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల మేరకు... తల్లి పాత్రలో రమ్యకృష్ణ, అత్త పాత్రలో విజయశాంతిలు నటించనున్నారన్నది తాజా సమాచారం. 
 
ఈ రెండు పాత్రలు చాలా పవర్ఫుల్‌గా ఉంటాయట. అందువల్లనే ఇంతటి క్రేజ్ వున్న సీనియర్ హీరోయిన్స్‌ను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. జగపతిబాబు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
 
కాగా, ప్రస్తుతం మహేష్ బాబు "మహర్షి" చిత్రంలో నటించగా, ఈ చిత్రం ప్రి రిలీజ్ ఫంక్షన్ తాజాగా జరిగింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా, దిల్ రాజుతో పాటు.. మరో ఇద్దరు నిర్మాతలు కలిసి నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి పునర్జన్మనిచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు!!

అద్దె విషయంలో జగడం.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై యువకుడు డ్యాన్స్

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments