Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి-2' రికార్డును ''సర్కార్'' తిరగరాస్తుందా?

Webdunia
శుక్రవారం, 26 అక్టోబరు 2018 (14:13 IST)
దీపావళి కానుకగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ''సర్కార్'' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌కు యూట్యూబ్‌లో భారీ వ్యూస్ వచ్చాయి. దీపావళి పండుగ కానుకగా నవంబర్ 6వ తేదీన భారీస్థాయిలో ''సర్కార్'' సినిమాను విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా తమిళనాడులో విడుదలకి ముందురోజు రాత్రి బెనిఫిట్ షోలు కూడా భారీగా వేస్తున్నారు. చెన్నైలో మాత్రమే వంద బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తున్నారు. 
 
మిగిలిన ప్రాంతాల్లో మరో వంద బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఈ సినిమాకి హిట్ టాక్ రావడమంటూ జరిగితే, వసూళ్లపరంగా తమిళనాడులో 'బాహుబలి-2' రికార్డును అధిగమించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. గతంలో మురుగదాస్-విజయ్ కాంబినేషన్లో కత్తి, తుపాకి  వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ సినిమాతో మళ్లీ హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయమని సినీ జనం అంటున్నారు. 
 
ఇదిలా ఉంటే, తుపాకి, మెర్సల్ సినిమాలతో విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైపోయారు. తెలుగులోకి అనువాదమైన ఈ రెండు సినిమాలను తెలుగు ప్రజలు ఆదరించారు. ఇప్పుడు ''సర్కార్'' సినిమాను కూడా తెలుగులోకి అనువాదం చేస్తున్నారు.
 
తెలుగు రాష్ట్రాల్లో కూడా నవంబర్ 6నే ఈ చిత్రం విడుదలవుతోంది. త్వరలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ ఫంక్షన్ కూడా నిర్వహించబోతున్నారని తెలుగు సినిమాలకు పీఆర్వోగా పనిచేస్తోన్న వంశీ కాక ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maha Kumbh Mela: మహా కుంభ మేళాలో పవన్.. చిన్నచిన్న తప్పులు జరుగుతాయ్ (video)

భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)

ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్: ఉండవల్లి అరుణ్ కుమార్

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments