Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెర్సల్ అదిరింది.. ఓవర్సీస్‌లో రయీస్, దంగల్ రికార్డు బ్రేక్.. 800 థియేటర్లలో?

కోలీవుడ్ స్టార్ విజయ్ మెర్సల్ ఓవర్సీస్ వసూళ్లలో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. అమెరికాలో తొలిసారిగా ఈ చిత్రం 800 థియేటర్లలో రిలీజైంది. ఇంకా తొలి రోజు 3లక్షల 57వేల 925 డాలర్లు వసూలు చేసింది. దీంతో తొలి

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:30 IST)
కోలీవుడ్ స్టార్ విజయ్ మెర్సల్ ఓవర్సీస్ వసూళ్లలో రికార్డు దిశగా దూసుకెళ్తోంది. అమెరికాలో తొలిసారిగా ఈ చిత్రం 800 థియేటర్లలో రిలీజైంది. ఇంకా తొలి రోజు 3లక్షల  57వేల 925 డాలర్లు వసూలు చేసింది. దీంతో తొలి రోజు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ''దంగల్'' (3లక్షల 28వేల డాలర్లు), షారూఖ్ 'రయీస్' సినిమా (3లక్షల 49వేల డాలర్లు) రికార్డులను దాటేసింది. దీంతో ఓవర్సీస్‌లో బాలీవుడ్ సినిమాలే సత్తా చాటేవనే రికార్డును మెర్సల్ తిరగ రాసింది. 
 
దక్షిణాదిలో ఇప్పటి దాకా రజనీకాంత్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ల సినిమాలకు మాత్రమే ఆకట్టుకునే వసూళ్లతో ఆకట్టుకునేవి. ఈ సంప్రదాయాన్ని ఈ మధ్యకాలంలో విడుదలైన తెలుగు సినిమాలు పూర్తిగా మార్చేశాయి. 'బాహుబలి', 'శతమానం భవతి', 'నేను లోకల్', 'ఫిదా', 'స్పైడర్' వంటి సినిమాలు ఓవర్సీస్‌లో మించి కలెక్షన్లు సాధించి సత్తాచాటాయి. ఈ నేపథ్యంలో పలు బాలీవుడ్ సినిమాల కలెక్షన్లను కూడా దాటేస్తున్నాయి. ఈ వరుసలో మెర్సెల్ కూడా నిలిచిపోయింది. 
 
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న తమిళనాట విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తెలుగులో కూడా ఈ సినిమాను ‘అదిరింది’ పేరుతో 19న విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా మళ్లీ అక్టోబర్ 27కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఒక్క రోజు మాత్రమే రెండు కోట్లు కలెక్షన్స్ సాధించింద. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా సమంత, కాజల్‌, నిత్యామేనన్‌ నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments