అయ్య బాబోయ్ పోలీసులు పిలిచారని.. ఐదింటికే లేచా: విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ‌కు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. యూత్‌లో మంచి ఫాలోయింగ్ వున్న ఈ హీరో వరుస సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా వున్నాడు. కథల ఎంపికలో కొత్తదనం వుండేలా చూసుకుంటున

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (14:38 IST)
అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ‌కు విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. యూత్‌లో మంచి ఫాలోయింగ్ వున్న ఈ హీరో వరుస సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా వున్నాడు. కథల ఎంపికలో కొత్తదనం వుండేలా చూసుకుంటున్న అర్జున్ రెడ్డి ఓ తమిళ సినిమాలో రాజకీయ వారసుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. 
 
ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
ఇదిలా ఉంటే... హీరో విజయ్ దేవరకొండ టెన్ కె రన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విజయ్ దేవర కొండ ఫన్నీగా మాట్లాడాడు. సిటీ పోలీసులు నిర్వహించిన 10కె రన్ కార్యక్రమానికి పొద్దునే లేచి రావడం చాలా కష్టమైందని.. అంత పొద్దున్న ఎట్లా లేస్తున్నర్రా బై అంటూ కామెంట్ చేశాడు. పోలీసులు పిలిచారనే అలారం పెట్టుకుని ఐదింటికి లేచానని లేకుండే ఏడుకో ఏడున్నరకో నిద్రలేస్తానని చెప్పాడు. 
 
ఆపై పీవీ సింధు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండలా కాకుండా ప్రాక్టీస్‌ల కోసం తెల్లవారుజామున లేస్తానని ఫన్నీ స్పీచ్ ఇచ్చింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, పీవీ సింధు మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. అలాగే షీ టీమ్స్ మహిళల భద్రత కోసం చేపట్టే చర్యలపై కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments