Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ మెగా ఇంటి అల్లుడు కానున్నాడా?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (18:30 IST)
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ మెగా ఇంటి అల్లుడు కాబోతున్నాడా... సాధారణ ప్రేక్షకులే కాదు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా షాకవుతున్న వార్త ఇది. ఎక్కడి నుండి పుట్టిందో తెలియదు కానీ విజయ్ దేవరకొండ, నిహారిక పెళ్లి విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతుంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నట్టు.. ఇందులో నిజం కూడా లేకపోలేదని నమ్ముతున్నారు కొంత మంది అభిమానులు.
 
పైగా నాగబాబు కూడా ఈ మధ్య నిహారిక‌కు సంబంధాలు చూస్తున్నామనీ.. మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసేస్తాను అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. సదరు మంచి సంబంధంలోని కుర్రాడు విజయ్ దేవరకొండ అని ప్రచారం జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ స్టార్‌గా వెలిగిపోతున్న విజయ్ దేవరకొండను తమ ఇంటి అల్లుడుగా చేసుకోవాలని మెగా ఫ్యామిలీ ఆలోచిస్తున్నారనే దానిలో నిజం ఎంత ఉంద‌నేది ఆసక్తికరంగా మారిందిప్పుడు.
 
కాగా.. ఇందులో మరో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఇదే నిహారిక పెళ్లి గతంలో హీరో నాగశౌర్యతో జరుగుతోందంటూ... పైగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ...  అందుకే అప్పుడు ఛ‌లో ఆడియో ఫంక్షన్ కు చిరంజీవి వచ్చాడంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ తర్వాత అవన్నీ పుకార్లే అని తేలిపోవడంతో ఆ టాపిక్ అక్కడితో ముగిసిపోయింది. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత విజయ్ దేవరకొండతో నిహారిక పెళ్లి జరుగుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.
 
పైగా విజయ్ దేవరకొండ.. అల్లు అరవింద్ భార్య తరపు నుండి బంధువులు అని కూడా తెలుస్తోంది. దాంతో ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కలుపుకుంటున్నారనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. 
 
కానీ గతంలో ఉదయ్ కిరణ్ విషయంలోనూ ఇలాగే అప్పట్లో చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ కావడం జరిగింది... తర్వాత ఉదయ్ కిరణ్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే... దాంతో అప్పటి నుండి మెగా కుటుంబంతో సంబంధం అంటే హీరోలు కూడా భయపడుతున్నారు. మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అస‌లు ఈ వార్త‌ల్లో నిజ‌మెంత ఉందో తెలియాలంటే కూడా ముందు ఎవ‌రో ఒక‌రు క్లారిటీ ఇవ్వాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మాయి కోసం ముగ్గురు యువకుల గొడవ... ఆటోవాలాను రైలు కింద తోసేసి...

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వంసిద్ధం - పోటీలో ఉన్నది ఎవరో తెలుసా?

హైదరాబాద్ లోనివీఎస్డీ టెక్ పార్క్‌లో ఇటాలియన్ రెస్టారెంట్ టోస్కానో బ్రాంచ్

స్నానం చేస్తుండగా కోడలిని వీడియో తీసిన మామ, బావ

Bhatti Vikramarka: రుణాలు అవసరం, వేధింపులు కాదు.. ఉదారంగా రుణాలు అందించాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

తర్వాతి కథనం
Show comments