త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. విజయ్ దేవరకొండ

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (13:39 IST)
'కుషి' సినిమా ద్వారా విజయ్ దేవర కొండ సినీ ప్రేక్షకుల ముందు రానున్నాడు. ఈ చిత్రంలో సమంత హీరోయిన్. ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఎలమంజలి నిర్మిస్తున్నారు. 
 
శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అనంతరం విజయ్ దేవరకొండ విలేకరులకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
 'ఖుషి' చిత్రం భారతదేశంలోని అభిమానులకు సులభంగా రిలేట్ అయ్యే రకమైన ప్రేమను హైలైట్ చేస్తుంది. పెళ్లి, సంబంధాలు, కుటుంబ వ్యవస్థ విలువ గురించి తెలియజేస్తుంది. 
 
తమిళంలో తనకు నచ్చిన దర్శకులు చాలామంది వున్నారని, తాను వెట్రిమారన్‌కి వీరాభిమానిని. బి.రంజిత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన సినిమాలు తనకెంతో ఇష్టం. వారితో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. 
 
ముఖ్యంగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ 'కెప్టెన్ మిల్లర్' సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. 'తానెప్పుడూ వైఫల్యానికి చింతించలేదు. ఆ సమయంలో కష్టమైనా సరే, త్వరలోనే నిర్ణయం తీసుకుని దాన్ని అధిగమించేస్తాను. అపజయం లేని జీవితం లేదు. 
 
వైఫల్యం తన పనిని ఎప్పటికీ ఆపదు. ఏం జరిగినా పరిగెడుతూనే ఉంటాను. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సాధారణంగా పెళ్లి గురించి మాట్లాడకుండా ఉండేవాడిని. ఇప్పుడు తాను చాలా చర్చిస్తున్నాను. తననా స్నేహితుల వివాహాన్ని ఆనందిస్తున్నాను. జీవితంలో మంచి చెడులను చూస్తున్నాను. అందరూ దాన్ని అధిగమించాల్సిందేనని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతోంది.. వైఎస్ షర్మిల ఫైర్

అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధాని.. రూ.7,500 కోట్ల రుణం కోసం కంఫర్ట్ లెటర్

cyclone ditwah live, శ్రీలంకను ముంచేసింది, 120 మంది మృతి, చెన్నై-కోస్తాంధ్రలకు హెచ్చరిక

ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ వున్నాడా? చంపేసారా? పాకిస్తాన్ చీలిపోతుందా?

తిరుమల శ్రీవారిదే భారం అంటూ తలపై మోయలేని భారంతో మెట్లెక్కుతూ మహిళ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments