విజయ్ చౌదరి నాగబాబుని 'కవ్వి'స్తున్నాడా?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (22:38 IST)
నాగబాబు వర్సెస్ బాలయ్యల పుణ్యమా అని ఇప్పటికే వేడెక్కి ఉన్న టాలీవుడ్‌ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు మధ్యలో మరి కొంత మంది పెద్ద మనుషులు. 2015వ సంవత్సరంలో ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియకుండా వచ్చి వెళ్లిపోయిన కవ్వింత అనే సినిమాకి డైరెక్టర్‌గా వ్యవహరించిన విజయ్ చౌదరి నాగబాబుపై తెగ ఫైర్ అయిపోతున్నాడు. 
 
వివరాలలోకి వెళ్తే... సుప్రసిద్ధ రచయిత త్రిపురనేని మహారథి మనవడైన సదరు దర్శకుడు విజయ్ చౌదరి మాట్లాడుతూ.. “నాగబాబు.. నువ్వు సంపూర్ణేష్ బాబు అంత పెద్ద నటుడివి. ఇండస్ట్రీలో ఉన్నక్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు అందరినీ లైన్‌లో నిలబెడితే వెనుక నుండి మొదట ప్లేస్ లో ఉండే నువ్వు బాలయ్య బాబుపై సెటైర్‌లు వేస్తుంటే.. ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు. చిరంజీవి తమ్ముడివి.. పవన్ కళ్యాణ్ అన్నవి అనే హోదా లేకపోతే నీకు అసలు గుర్తింపే లేదు.
 
నువ్వు ఇండస్ట్రీకి చేసిన గొప్ప ఏంటి..? బాలయ్య బాబుని పిలవకుండా మీటింగ్‌లు జరిపేంత కెపాసిటీ ఉందా మీకు..? మీ అన్న చిరంజీవి కూడా హీరో మాత్రమే.. ఇండస్ట్రీ మొత్తం మీ ఫ్యామిలీది అనుకుంటున్నారా? బాలయ్య బాబుని మీటింగులకు పిలవాల్సిన బాధ్యత మీదే. బాలయ్యని… ‘నువ్వేమీ కింగ్ కాదు’ అంటున్నావ్.. నువ్వేమన్నా కింగా..? మీ అన్నా తమ్ముడు కింగ్‌లు అనుకుంటున్నారా..?
 
మీలాగా బాలయ్య మనసులో ఒకటి పెట్టుకొని బయటకి మరొకటి చెప్పే రకం కాదు. మీ సామాజిక వర్గంలో మీరు కాకుండా ఇంకో హీరోని పైకి ఎదగనివ్వలేదు మీరు..! కేవలం మీ స్వార్థ బుద్ధి వల్ల మీ సామాజిక వర్గంలో మరో హీరోని ఎదగనివ్వకుండా తొక్కేసారు..! మీరు పెట్టిన పీఆర్పీ పార్టీకి ఫండ్స్ ఇచ్చిన మీ వర్గం వారిని నాశనం చేసిన మీరు బాలయ్య బాబు గురించి మాట్లాడతారా?” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments