Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ లవ్ గురు మూవీ నుంచి చెల్లెమ్మవే.. సాంగ్ రిలీజ్

డీవీ
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (17:37 IST)
Vijay Antony, Mrinalini Ravi
హీరోగా ఓ ప్రత్యేకతతో  విజయ్ ఆంటోనీ తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ టాలెంటెడ్ హీరో. విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో "లవ్ గురు" పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. "లవ్ గురు" సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇవాళ ఈ సినిమా నుంచి 'చెల్లెమ్మవే..' అనే సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు భాష్యశ్రీ లిరిక్స్ అందించారు. భరత్ ధనశేఖర్ సంగీతాన్ని అందించగా..ఆదిత్య ఆర్కే పాాడారు. 'చెల్లెమ్మవే చెయ్యి పట్టుకోవే..నా చెల్లివే..నువు నా చెల్లివే..నేనున్నదే నీ కోసమే..విధి రాసెనే, ఒక రాతనే...ఆ ఆటలో ఎద కృంగెనే..' అంటూ హీరో తన సోదరిని తల్చుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో ఎమోషనల్ గా సాగుతుందీ పాట. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న "లవ్ గురు" సినిమాలో హార్ట్ టచింగ్ సెంటిమెంట్ కూడా ఉంటుందని ఈ పాటతో తెలుస్తోంది. "లవ్ గురు" సినిమాను సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాతో మరింతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
 
నటీనటులు - విజయ్ ఆంటోనీ, మృణాళినీ రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments