పిల్లలకు వార్నింగ్‌తో అనన్యనాగళ్ల నటించిన తంత్ర పోస్టర్!

డీవీ
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (17:07 IST)
Tantra poster
తమ సినిమాకి A సర్టిఫికేట్  రావడంపై 'తంత్ర' టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ 'A' ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నిజానికి ఇదొక  సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. అలానే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావద్దని వారిస్తున్నారు.
 
ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. 'ధీరే ధీరే' సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. 
 
వీరే కాకుండా మర్యాదరామన్న ఫేం సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ఈ హార్డ్‌హిట్టింగ్ హర్రర్ డ్రామాకి తమదైన గాఢతని తీసుకొచ్చారని దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెలిపాడు. మారుమూల శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామం నుంచి వచ్చిన ఈ దర్శకుడు వాల్ట్‌డిస్నీలో పనిచేసే స్థాయికి ఎదిగి, సినిమా తీయాలన్న తన లక్ష్యాన్ని 'తంత్ర 'తో సాధించాడు.
 
ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు నరేష్ బాబు, రవిచైతన్య ప్రకటించారు. 
నటీనటులు:అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ట్విట్టర్‌లో పోస్ట్, నారా లోకేష్ వార్నింగ్

చొరబాటుదారులు కేన్సర్ రోగులు వంటివారు : కంగనా రనౌత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments