Webdunia - Bharat's app for daily news and videos

Install App

వియన్నాకు వెళ్లి చిక్కుల్లో పడ్డ విద్యుల్లేఖా రామన్.. బ్యాగు.. పాస్ పోర్టు, నగదు మిస్!?

Webdunia
బుధవారం, 4 మే 2016 (16:38 IST)
కామెడీ నటీమణిగా పేరు సంపాదించిన విద్యుల్లేఖా రామన్ వియన్నాకు వెళ్లి చిక్కుల్లో పడ్డారు. రాజుగారి గది, రన్ రాజా రన్, సరైనోడు వంటి సినిమాల్లో కామెడీ నటీమణిగా మంచి గుర్తింపు సంపాదించిన విద్యుల్లేఖా స్నేహితులతో కలిసి ఇటీవల ఆస్ట్రియాలోని వియన్నాకు పర్యటన కోసం వెళ్లారు.

అయితే అక్కడ ఆమె తన బ్యాగును పోగొట్టుకున్నారు. సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యుల్లేఖా బ్యాగులో పాస్ పోర్ట్, కార్డులు, నగదును పోగొట్టుకున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 
 
హోటల్ లాబీలో ఎవరో తన బ్యాగును దొంగలించుకుపోయారని, ఆ దొంగలు ఎవరనే దానిపై విచారణ కోసం హోటల్ యాజమాన్యం సహకరించట్లేదని, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిద్దామనుకుంటే అంగీకరించట్లేదని విద్యుల్లేఖా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో విదేశంలో నిస్సహాయ స్థితిలో ఉన్న తమను కాపాడాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌లను విద్యుల్లేఖా అభ్యర్థించారు. 
 
హోటల్ లాబీల్లో విద్యుల్లేఖా బ్యాగు అపహరణకు గురైందని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. తమ కుమార్తెను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments