Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ - శంకర్ 'రోబో 2.0'లో ఆ చిత్రంలోని శ్రీదేవి భర్త ఆదిల్ హుస్సేన్!

Webdunia
బుధవారం, 4 మే 2016 (14:50 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ''రోబో''. ఈ చిత్రం ఎన్ని సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ''రోబో 2.0'' అనే టైటిల్‌తో మూవీ తెరకెక్కుతుంది. రజినీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 2.0 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు శంకర్ భారీ ప్రణాళికలే రూపొందిస్తున్నారు. 
 
భారత్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నఈ చిత్రంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర ఉందట. అది కూడా చాలా పవర్ఫుల్ రోల్ కావడంతో, ఆ పాత్ర కోసం 'సుధాంశు పాండే'ను తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో బాలీవుడ్ నటుడు చేరనున్నాడు. అతిలోక సుందరి శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్‌లో నటించిన ''ఇంగ్లీష్ వింగ్లీష్'' సినిమాలో శ్రీదేవి భర్తగా నటించిన అదిల్ హుస్సేన్‌ను ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం తీసుకోనున్నారట. 
 
విలన్‌ల బృందంలో ఉండే సైంటిస్ట్‌గా ఆదిల్ కనబడనున్నాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. రోజు రోజుకి ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.  ''ట్రాన్స్ ఫార్మర్స్'', ''పేర్ల హార్బర్'', ''డై హార్డ్'', ''మిషన్ ఇంపాజిబుల్'' వంటి సినిమాలకు యాక్షన్ కంపోజ్ చేసిన కెన్నీ బేట్స్ "రోబో 2.0''కి యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రోబోకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్‌ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరున చెన్నైలో మరో షెడ్యూల్ జరిపేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారట. 2017లో రోబో 2.0 చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments