Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విజయ్ కూడా చనిపోయేవాడు.. మత్స్యకారుల కంట పడటంతో ఊపిరితో ఉన్నాడు..

‘మాస్తిగుడి’ కన్నడ చిత్రం క్లైమాక్స్‌ దృశ్యాల చిత్రీకరణ శాండల్‌వుడ్‌లో అంతులేని విషాదాన్ని నింపింది. నిలువెత్తు నిర్లక్ష్యం కొంప ముంచగా ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి వచ్చిన ఇద్దరు విలన్ల రంగుల కల చెదిరింద

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (10:12 IST)
‘మాస్తిగుడి’ కన్నడ చిత్రం క్లైమాక్స్‌ దృశ్యాల చిత్రీకరణ శాండల్‌వుడ్‌లో అంతులేని విషాదాన్ని నింపింది. నిలువెత్తు నిర్లక్ష్యం కొంప ముంచగా ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి వచ్చిన ఇద్దరు విలన్ల రంగుల కల చెదిరింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ ప్రమాదంలో హీరో విజయ్‌ కూడా నీట మునిగిపోవాల్సిన వాడే. అదృష్టం బాగుండి సమీపంలోని మత్స్యకారుల తెప్ప కంట పడటంతో అతన్ని చివరి క్షణంలో కాపాడగలిగారు. 
 
ఈ లోపు మిగిలిన ఇద్దరిని కూడా కాపాడాలని భావించినా వారు ఈతరాక నీట మునిగారు. చనిపోయిన ఇద్దరిలో ఉదయ్‌ మూడు రోజుల క్రితమే పెళ్ళి చూపులకు వెళ్ళివచ్చాడు. తన అక్క, చెల్లి వివాహాలు జరిపి తాను కూడా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నంతలోనే విధి అతన్ని జల సమాధి రూపంలో కాటేసింది. మరో విలన్ అనిల్‌కు వివాహమై ఇద్దరు బిడ్డలున్నారు. వీరిద్దరి అకాల మృతితో ఆధారం కోల్పోయిన వీరి కుటుంబాలు దిక్కులు పిక్కటిల్లేలా హృదయ విదారకరంగా రోదిస్తున్నాయి.
 
కన్నడ చిత్రం ‘మాస్తిగుడి’ క్లైమాక్స్ షూటింగ్‌లో ప్రాణాలు విడిచిన నటుడు ఉదయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను తలచుకుని ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ‘ఇలాంటి స్టంట్‌ను నేను చేయడం ఇదే మొదటిసారి. మొదటి అంతస్తు నుంచి కిందకు చూడాలంటేనే భయపడే నేను, ఆ దేవుడి దయ వల్ల ఈ స్టంట్ పూర్తి చేస్తానని ఆశిస్తున్నా’ అంటూ కన్నడ న్యూస్ ఛానెల్ ‘సువర్ణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా, 'జక్కన్న', 'బుల్లెట్ రాణి' వంటి తెలుగు చిత్రాల్లో కూడా ఉదయ్ నటించాడు. తాజాగా, ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ చిత్రంలో కూడా ఉదయ్ నటించినట్లు తెలుస్తోంది. 

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments