Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ యువ హీరోలు 'రెడ్డి' అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నారా? వాళ్ళనే ఎందుకు పెళ్లాడుతున్నారు?

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన యువ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పి సంసార జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇలా అడుగుపెట్టేవారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకే అల్లుళ్లుగ

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (08:52 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన యువ హీరోలు ఒక్కొక్కరుగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పి సంసార జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇలా అడుగుపెట్టేవారంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలకే అల్లుళ్లుగా వెళుతున్నారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ హీరోలు వివాహం చేసుకున్న అమ్మాయిలంతా ఈ వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. 
 
అపోలో సంస్థల ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనువరాలు ఉపాసన రెడ్డిని మెగాహీరో రాంచరణ్ పెళ్లి చేసుకున్నారు. మరో మెగా హీరో అల్లు అర్జున్ విద్యారంగంలో పేరున్న వ్యాపారవేత్త కేసీ శేఖర్‌రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు.
 
అలాగే హీరో మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్‌లు కూడా రెడ్డి అమ్మాయిలనే పెళ్లి చేసుకున్నారు. వీరిలో విష్ణు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికా రెడ్డిని పెళ్లి చేసుకుంటే.. మనోజ్ మాత్రం చిన్న కుమారుడు ప్రణతి రెడ్డిని వివాహమాడాడు. 
 
ఇకపోతే ఎన్టీఆర్ మనువడు తారకరత్న సైతం అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని రహస్య వివాహం చేసుకోగా, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్‌ రెడ్డి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో అక్కినేని వారసుడు అఖిల్ చేరబోతున్నాడు. జీవీకే సంస్థల వ్యవస్థాపకుడు జీవీకే రెడ్డి మనువరాలు శ్రియా భూపాల్ రెడ్డిని పెళ్లాడబోతున్నాడు. 
 
అయితే, ఈ హీరోలంతా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లేకాక పెద్ద పెద్ద వ్యాపార కుటుంబాలకు చెందినవాళ్లే. అంతేకాదు, వాళ్లంతా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్నత చదువులను పూర్తి చేశారు. ఒకరకంగా, హీరోలంతా కులాంతర వివాహాలు చేసుకున్నారు. ఈ వివాహాలు చూడటానికి ఆదర్శవంతమైన వివాహాల్లా అనిపిస్తున్నా రెడ్డి వర్గానికి చెందిన అమ్మాయిలనే ఎంపిక చేసువడం వెనుక ఏదేని మతలబు ఉందా అనేది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments