Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హీరోయిన్ అనే హోదా చూసి కత్రినా కైఫ్‌ను ప్రేమించలేదు : విక్కీ కౌశల్

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2023 (20:17 IST)
స్టార్ హీరోయిన్ అనే హోదా చూసి కత్రినా కైఫ్‌ను ప్రేమించలేదని బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ, కత్రినాకైఫ్‌తో వివాహం తర్వాత తాను ఎంతో సంతోషంగా ఉన్నానన్నారు. ఆమె రాకతో తన జీవితం పరిపూర్ణమైందన్నారు. ఎన్నో విషయాల్లో ఆమె తనని గైడ్‌ చేస్తుంటుందన్నారు. అనంతరం, ఆయన తమ ప్రేమకథను గుర్తుచేసుకున్నారు.
 
'స్టార్‌ హీరోయిన్‌ అనే హోదా చూసి కత్రినాకైఫ్‌ను ప్రేమించలేదు. ఆమె మంచి మనసు తెలుసుకున్నాక ఇష్టపడటం మొదలుపెట్టా. రోజులు గడిచే కొద్దీ ఆమెపై ప్రేమ పెరిగింది. ఆమె అటెన్షన్‌ పొందడం చాలా కష్టం అనిపించింది. అలాంటి సమయంలోనే ఓ కార్యక్రమంలో ఆమె నా గురించి మాట్లాడారు. ఆ విషయం తెలిసి ఎంతో ఆనందించాను. 
 
నిజంగానే ఆమె నా గురించి మాట్లాడారా..? అని ఆశ్చర్యపోయా. కొంతకాలానికి ఆమెతో పరిచయం ఏర్పడింది. అలా, మేమిద్దరం ప్రేమలో పడ్డాం. ఈ విషయాన్ని మొదట నా కుటుంబ సభ్యులకు చెప్పా. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాం' అని విక్కీ చెప్పారు. పిల్లల గురించి మాట్లాడుతూ.. 'పిల్లల విషయంలో ప్రస్తుతానికి మా వాళ్లు ఏమాత్రం ఒత్తిడి చేయడం లేదు' అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments