Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెట్రిమారన్ విడుతలై పార్ట్ 1 ఏప్రిల్ 15న రిలీజ్ కానుంది

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2023 (16:05 IST)
Vijay Sethupathi
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ యొక్క "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్"  ద్వారా  తమిళ చిత్రం "విడుతలై పార్ట్ 1" తెలుగు వెర్షన్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్  ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ తో పాటు దర్శకుడు వెట్రిమారన్ ను కలిసి తెలియజేసారు.
 
ఈరోజు మేకర్స్ ఈ సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. తెలుగులో విడుతలై  పార్ట్ 1 పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 15న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.
 
వెట్రిమారన్ రచన మరియు దర్శకత్వం వహించిన చిత్రం "విడుతలై  పార్ట్ 1".  ఈ చిత్రం ఒక తీవ్రమైన క్రైమ్ ప్రొసీజర్ థ్రిల్లర్.  ఇది తిరుగుబాటు నాయకుడైన పెరుమాళ్ (విజయ్ సేతుపతి) మరియు 'ఆపరేషన్ ఘోస్ట్ హంట్' కింద అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాల చేస్తున్న పోలీసు అధికారుల  చుట్టూ తిరుగుతుంది. సూరి కుమారేశన్ పాత్రను పోషిస్తున్నారు. గౌతం మీనన్, రాజీవ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ చిత్రం మార్చి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విమర్శకుల ప్రశంసలను  అందుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా, ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.ఈ చిత్రం ఏప్రిల్ 15న న "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్"  ద్వారా  తెలుగులో విడుదలకానుంది,

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీచర్ కొట్టారంటూ టీచర్లపై ఫిర్యాదు : విద్యార్థితో పాటు తల్లిదండ్రులపై పోక్సో కేసు!

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు కాలర్ ఐడీ సదుపాయాన్ని తీసుకొస్తున్న సర్వీస్ ప్రొవైడర్లు!

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments