Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ కన్నుమూత

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (17:55 IST)
బాలీవుడ్ సీనియర్ నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ ఇకలేరు. ఆయన బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 79 యేళ్లు. వయోభారంతో పాటు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన బుధవారం కన్నుమూసినట్టు తెలిపారు. ఈయన 'బాద్‌షా', 'కిలాడి' వంటి సినిమాల్లో తనదైన హాస్యంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 

2001లో వచ్చిన మల్టీ స్టారర్‌ మూవీ చోరీ చోరీ చుప్‌కే చుప్‌కేలో హోటల్‌ మేనేజర్‌గా, అక్షయ్‌ కుమార్‌ మూవీ కిలాడీలో ప్రిన్సిపల్‌ పాత్రలో, షారుక్‌ ఖాన్‌ నటించిన బాద్‌షాలో క్యాసినో మేనేజర్‌గా వేసిన పాత్రలు దిన్‌యర్‌కు బాగా ప్రాచుర్యం కల్పించాయి. గుజరాత్‌, హిందీ నాటక రంగంతో అనుబంధం కలవాడు. ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

కాగా, దిన్యర్ కాంట్రాక్టర్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసి, ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆత్మహత్య చేసుకున్న పీజీ మెడికల్ విద్యార్థిని.. ఆ ఒత్తిడితోనే మరణించిందా? కారణం ఏంటో?

ఏపీలో న్యాయం, ధర్మం కనుమరుగైంది.. అమరావతి పేరుతో అవినీతి: జగన్ (video)

మద్యం మత్తులో చోరీకి వెళ్లి ఇంట్లోనే నిద్రపోయిన దొంగ

వంట గ్యాస్ సిలిండర్ పేలుడు : ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

వివేకా హత్య కేసు విచారణ పూర్తయింది : సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments