అబ్బా.. అప్పుల బాధ తీరేదెలా? చీమలకు చక్కెర వేస్తే? (video)

శనివారం, 1 జూన్ 2019 (11:55 IST)
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో అప్పులు చేసి ఉంటారు. వ్యాపార అవసరాల కోసమో, వ్యక్తిగత అవసరాల కోసమో మరేదైనా కారణం కోసమో అప్పులు చేయడం సహజం.

అయితే కొందరు తీసుకున్న అప్పులను తీర్చడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని రకాల నియమాలను పాటించడం ద్వారా అప్పుల బాధ నుండి బయటపడవచ్చంటున్నారు పండితులు. అవి ఏమిటో ఇక్కడ చూద్దాం.
 
ప్రతి బుధవారం రెండు చిన్న చిన్న ఖాళీ కుండల్లో ముద్ద కర్పూరం వెలిగించి వాటిని ప్రవహిస్తున్న నీటిలో వదిలేయండి. ఇలా ఆరు వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం మంచి లాభాల బాట పడుతుంది.
 
పీచు తీసిన ఒక కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని స్మరించుకుని ఆ కొబ్బరికాయను నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది.
 
పసుపు వత్తులతో 5 గురువారాలు ఆవునెయ్యితో లక్ష్మి దేవి వద్ద దీపం పెట్టి  కనకధార స్తోత్రాన్ని పటించండి, అలాగే చీమలకు చక్కెర వేస్తుండటం వల్ల అప్పుల బాధలు త్వరగా తీరిపోతాయి. 
 
ఉదయం లేవగానే రెండు అరచేతులు దగ్గరగా చేసి అందులోకి చూడండి. విష్ణు, మహాలక్ష్మిల అనుగ్రహం పొందడమే కాకుండా అప్పుల బాధ తీరి, మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 01-06-2019 నుంచి 30-06-2019 వరకు మీ మాస ఫలితాలు