ఈ రోజుల్లో అసిడిటీ, గ్యాస్ సమస్య అందరికీ ఉండేదే. మసాలాలు తిన్నా, లేదా అధికంగా ఆహారం తీసుకున్నా ఇది ఎక్కువ అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే దీని నుండి బయటపడవచ్చు. మందులు వాడటం కంటే సహజ సిద్ధమైన పద్ధతిలో నయం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
పుచ్చకాయలో పీచు పదార్థాలు, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో అసిడిటి తలెత్తకుండా అడ్డుకుంటాయి. ఈ పండులోని చల్లదనం, నీటి కారణంగా శరీరంలో హైడ్రేడ్ సమస్య తలెత్తదు. పిహెచ్ పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది. యాపిల్, బొప్పాయి వంటి వాటిల్లో కూడా పీచుపదార్థాలు బాగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఎసిడిటీ తలెత్తకుండా కాపాడతాయి.
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎంతో మంచిది. ఇది ప్రకృతి సహజంగా లభించే పానీయం. ఇందులో క్లీనింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. కొబ్బరి నీళ్లలో కూడా పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి. కొబ్బరి నీళ్లను నిత్యం తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.
ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు చల్లటి పాలు తాగాలి, స్టొమక్‌లోని యాసిడ్‌ని పాలు పీల్చేసుకుంటాయి. దీంతో కడుపులో మంట ఉండదు. ఎసిడిటీ కారణంగా హార్ట్ బర్న్ తలెత్తితే పంచదార వేసుకోకుండా చల్లటి పాలు తాగాలి.
అరటిపండు ఎసిడిటీ మీద బాగా పనిచేస్తుంది. అరటి పండులోని పొటాషియం స్టొమక్ అంచుల్లో మ్యూకస్‌ను ఉత్పత్తి చేసి శరీరంలోని పిహెచ్ ప్రమాణాన్ని తగ్గిస్తుంది. అరటిపండ్లలో పీచుపదార్థాలు కూడా బాగా ఉంటాయి. ఎసిడిటీకి మిగతా పండ్ల కంటే అరటిపండు మెరుగ్గా పనిచేస్తుంది.