Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ అడిగిన ప్రశ్నలకు వెంకికుడుముల హానెస్ట్ సమాధానాలు

దేవి
గురువారం, 13 మార్చి 2025 (12:17 IST)
Venkikudumula, Nithin
హీరో నితిన్ చిత్రం రాబిన్‌హుడ్. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ నేపధ్యంలో హీరో నితిన్, దర్శకుడు వెంకికుడుముల హానెస్ట్ పాడ్ కాస్ట్ లో చిట్ చాట్ అనే కొత్త ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
 
నితిన్: ప్రతి హీరో చాలా సినిమాల్లో యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు హీరో ముందున్న ఫైటర్లను కొడుతుంటే వెనుక వున్న వారు అలానే నిలబడి వుంటారు? ఎందుకలా?
దర్శకుడు: వెనుకవున్నవారు కూడా ముందుకు వస్తే హీరోకు దెబ్బలు తగులుతాయి. అందుకే అలా సినిమాల్లో పెడతారు.
 
పొద్దేనే హీరో నిద్ర లేవగానే చాలా అందంగా కనీసం జుట్టు చెదరకుండా, ఏదో జెల్ పెట్టినట్లు వుంటుంది. పైగా ఫేస్ ఫ్రెష్ గా వుంటుంది. అదెలా?
అందుకే నేను రాత్రే హీరో జుట్టుకు జెల్ పెట్టి ఫ్రెష్ గావుండేలా తయారుచేస్తాను. అది పొద్దేనే ఎఫెక్ట్ గా వుంటుంది.
 
సినిమాల్లో నార్త్ నుంచి హీరోయిన్లు చేయడం అవసరమా?
అందుకే నేను సౌత్ వారినే నా సినిమాల్లో పెడుతుంటా.
 
మీ సినిమాల్లో శుభం కార్డ్ ఎందుకు వేయరు?
సినిమా రిలీజ్ అయ్యాక కదా? అది శుభమా? అశుభమా?  అని తెలిసేది.
 
హీరోకు మార్కెట్ కు రాగానే ఓ సాంగ్, ఫైట్ పెడతారు. అక్కడ ఆయన స్టెప్ లేయగానే అక్కడ కూరగాయలు అమ్మేవారు కూడా డాన్స్ లో జాయిన్ అయి స్టెప్ లేస్తారు? ముందుగానే హీరో డాన్స్ వేస్తాడనీ, పాట పాడతాడని తెలుసా?
నేను నా సినిమాలో ఆ కూరగాయలు, పాలు అమ్మేవాడికి డాన్స్ వచ్చుఅని తెలిసి ఆ సాంగ్ ను నేను అక్కడ పెడతా. అంటూ సరదాగా ప్రమోషన్ ఆరంబించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్

Heavy Rains: కేరళలో రోజంతా భారీ వర్షాలు.. పెరిగిన జలాశయాలు.. వరదలు

Vana Durgamma: భారీ వరదలు.. నీట మునిగిన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments