Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ సైంధవ్ కీలక షెడ్యూల్ పూర్తి

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (17:14 IST)
Venkatesh Saindhav
విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రం ‘సైంధవ్’కు టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్ లో చాలా ముఖ్యమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
 
ఓ పాట చిత్రీకరణ కోసం భారీ సెట్ వేశారు. మొదటి షెడ్యూల్ లో ప్రధాన నటులపై కీలకమైన సన్నివేశాలను, ఫైట్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా రూపొందించారు. సినిమా రూపుదిద్దుకుంటున్న తీరు పట్ల చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది.
 
సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ అద్భుతమైన స్పందన తో ఆసక్తిని పెంచాయి. సైంధవ్ భారీ బడ్జెట్తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
ఇతర నటీనటులను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.  సైంధవ్  పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా  విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments